![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఐన ప్రియాంక జైన్, శివ్ , టేస్టీ తేజ ముగ్గురూ కలిసి ఒక ఫుడ్ వ్లాగ్ చేశారు. ఇక ఇందులో తేజ తనకు మౌనరాగం సీరియల్ లో హీరో ఆఫర్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు. ఆ ఆఫర్ తాను వదులుకున్నాడు కాబట్టి శివ్ కి ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పాడు . తర్వాత శివ్ ని ముందు ప్రియాంక ప్రొపోజ్ చేసిందని..తనకు ఐ లవ్ యు చెప్పిందని చెప్పాడు. దానికి శివ్ రెండు వారాలు టైం తీసుకుని ఐ లవ్ యు టూ అని చెప్పాడట. "అదేంటి శివ్ ఆ ఒక్క మాట చెప్పడానికి రెండు వారాల టైం తీసుకున్నావా.. ఇప్పుడు ఫీలవుతున్నా అసలు మౌనరాగం ఎందుకు వదిలేసుకున్నానా" అని అన్నాడు తేజ. "ప్రియాంక మూడు నెలలు లేకపోయేసరికి చాలా హ్యాపీగా ఉన్నాను మూడు ఫారెన్ ట్రిప్పులు కూడా వేసాను.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి వన్ మంత్ అయ్యింది ఇంతవరకు ఎక్కడికీ పోలా" అని ఫీలవుతుంటే తేజ అద్భుతమైన సలహా ఇచ్చాడు "నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ కోసం ట్రై చెయ్యి అన్నా" అనేసరికి "బిగ్ బాస్ జోలికి కూడా వెళ్ళను నేను అన్నాడు..." "నువ్వు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిపోతే నేను తేజ, శోభా ముగ్గురం కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్తాం" అంది ప్రియాంక.
"ఒక వేళా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తే టేస్టీ తేజ కూడా నాతో కలిసి హౌస్ కి రావాలని డిమాండ్ చేస్తా" అని చెప్పాడు శివ్. ఇక తేజ "ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నావా" అంటూ ఫాన్స్ అడుగుతున్నారు అనేసరికి "ఇండియా వదిలి ఎక్కడికీ వెళ్ళను" అని చెప్పింది. "సీరియల్స్ కి ముందు తనను ఆ సీరియల్ క్యారెక్టర్స్ తో పిలిచేవాళ్ళు కానీ తర్వాత బిగ్ బాస్ ప్రియాంక అని పిలవడం స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు ఈ గొడవలు అవీ వద్దు అని నో చెప్పా కానీ తర్వాత ఇంట్లో వాళ్ళు వెళ్ళమని గట్టిగా పట్టుబట్టేసరికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాను" అంటూ ఎన్నో విషయాలు చెప్పింది.
![]() |
![]() |